Pushpa Movie : పుష్ప సినిమాలో పెట్టిన ఈ సీన్‌.. నిజ జీవితంలోనూ చాలా మందికి జ‌రిగింది..!

July 3, 2022 10:50 PM

Pushpa Movie : టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ మూవీ వ‌ల్ల సుకుమార్‌కు మంచి పేరు రావ‌డం మాత్ర‌మే కాదు.. మరోవైపు బ‌న్నీ, ర‌ష్మిక మందన్న‌ల‌కు కూడా జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ల‌భించింది. బ‌న్నీ, రష్మిక‌ల‌కు ఇప్పుడు ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయి. హిందీ మార్కెట్ నుంచి సైతం బ‌న్నీతో సినిమా చేసేందుకు ఎంతో మంది ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక పుష్ప మూవీకి రెండో భాగ‌మైన పుష్ప 2 కూడా త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే పుష్ప సినిమాను ఇప్ప‌టికే చాలా మంది చూసి ఉంటారు. అందులో క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది. ఎస్‌పీ భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్‌తో క‌లిసి పుష్ప చివ‌ర్లో మ‌ద్యం సేవిస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే పుష్ప ఒక డైలాగ్ వాడుతాడు. మ‌నిషి క్యారెక్ట‌ర్ అనేది అత‌ను ధ‌రించే దుస్తుల్లో ఉండ‌ద‌ని.. అత‌ని వ్య‌క్తిత్వంపై అది ఆధార ప‌డుతుంద‌ని అంటాడు. అయితే నిజ జీవితంలోనూ చాలా మందికి ఈ విధ‌మైన సంఘ‌ట‌న ఎదుర‌య్యే ఉంటుంది. ఎందుకంటే మ‌న స‌మాజంలో ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితులు ఉన్నాయి మ‌రి.

Pushpa Movie this scene happend in everybody life
Pushpa Movie

ఒక వ్య‌క్తిని చూసే అత‌ను ఎలాంటి వాడ‌నేది స‌మాజం నిర్ణ‌యిస్తుంది. ముఖ్యంగా అత‌ను ధ‌రించే ద‌స్తులు వాటి బ్రాండ్ ను బ‌ట్టి అత‌ని క్యారెక్ట‌ర్‌ను నిర్ణ‌యిస్తుంది. అంతేకానీ అత‌ను ఎలాంటి మంచి ప‌నులు చేసినా స‌మాజం వారిని గుర్తించ‌దు. ఇదే పుష్ప‌లో చూపించారు. అక్క‌డ బ్రాండ్ అనేది వ్య‌క్తిత్వాన్ని బ‌ట్టి ఉంటుంది కానీ.. అత‌ను ధ‌రించే దుస్తుల‌ను బ‌ట్టి ఉండ‌ద‌ని చెప్పారు. ఇదే విష‌యం చాలా మందికి ప‌ర్స‌న‌ల్‌గా ఎదురైన అనుబ‌వ‌మే. సుకుమార్ ఇలాంటి సీన్ల‌ను పెడ‌తారు క‌నుక‌నే ఆయ‌న మూవీలు హిట్ అవుతున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now