Pushpa Movie : టాలీవుడ్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 17న ఖరారైన విషయం తెలిసిందే. అందుకే హీరో అల్లు అర్జున్ తన సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న అల్లు అర్జున్ కి షాక్ తగిలింది. పుష్ప సినిమా బహుశ హిందీ మార్కెట్ లో రిలీజ్ కాకపోవచ్చని అంటున్నారు సినీ నిర్మాతలు.
పుష్ప సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారు. మొదట ఫస్ట్ పార్ట్ ని నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తుంది ఫిల్మ్ టీమ్. ఈ క్రమంలో ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఫిల్మ్ మేకర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని అనుకోకముందే హిందీ డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేశారట. అందుకే ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సదరు డిస్ట్రిబ్యూటర్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మేకర్స్ కి, హిందీ డిస్ట్రిబ్యూటర్ కు జరిగిన చర్చలు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, పుష్ప సినిమా హిందీ మార్కెట్ లో రిలీజ్ కాకపోవచ్చని అంటున్నారు. ఇదే కనుక జరిగితే పుష్ప సినిమాని పాన్ ఇండియా సినిమా లిస్ట్ లో చేర్చరు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ ని ఒప్పించేందుకు కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నారట.
ఈ సినిమాలో లాస్ట్ సాంగ్ ను 1000 మందికి పైగా డాన్సర్లతో షూట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మరి ఇన్ని హంగులతో తెరకెక్కుతున్న సినిమా హిందీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో లేదో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…