Pushpa Movie : పుష్ప మూవీలో అన‌సూయ‌.. సునీల్ మీద‌కెక్కి ర‌చ్చ చేసింది..

December 3, 2021 9:14 PM

Pushpa Movie : సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే తొలి పార్ట్‌ను డిసెంబ‌ర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసింది. కాగా పుష్ప మూవీ ట్రైలర్‌ను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌నుండ‌గా.. ఈ ట్రైల‌ర్‌కు చెందిన చిన్న టీజ‌ర్ శాంపిల్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో అన‌సూయ అరాచ‌కం సృష్టించింది.

Pushpa Movie anasuya bhardwaj on sunil her scene is making fans thrill

పుష్ప ట్రైల‌ర్‌కు చెందిన టీజ‌ర్‌లో ర‌ష్మిక‌కు చెందిన కొన్ని సీన్లు క‌నిపించ‌గా.. ఈ మూవీలో దాక్షాయ‌ణిగా క‌నిపించ‌నున్న అన‌సూయ ర‌చ్చ చేసింది. మంగ‌ళం శీను పాత్ర‌లో న‌టిస్తున్న సునీల్ మీద‌కు అన‌సూయ ఎక్కి ర‌చ్చ చేసింది. అన‌సూయ త‌న నోట్లో బ్లేడు పెట్టుకుని క‌నిపించింది. దీంతో ఆమె ఈ మూవీలో సునీల్‌కు భార్య‌గా చేస్తుందా ? అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

అయితే అనసూయ ఈ మూవీలో చేసిన రచ్చ టీజ‌ర్‌లోనే ఇలా ఉంటే.. రేపు సినిమాలో ఎలా ఉంటుందోన‌ని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు అన‌సూయ‌ను ట్రోల్ చేస్తున్నారు. మంగ‌ళం శీను పాత్ర‌లో సునీల్ న‌టిస్తున్నాడు క‌నుక అత‌నికి భార్య‌గా అన‌సూయ న‌టించి ఉంటుంద‌ని, అందుక‌నే ఆమె అలా ఆ సీన్‌లో చేసి ఉంటుంద‌ని అనుకుంటున్నారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాలంటే సినిమా విడుద‌ల అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment