Puri Jagannadh : చార్మీ ఐ ల‌వ్ యూ.. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కామెంట్స్ వైర‌ల్..

Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో రాబోతున్న క్రేజీ ప్యాన్ ఇండియా సినిమా లైగ‌ర్. బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్, సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ, బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఆగ‌స్టు 25న భారీ ఎత్తున ఈ మూవీ విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌లు ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఇంకా పెంచేశాయి.

ఇక హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతోపాటు నిర్మాత‌లైన పూరీ జ‌గ‌న్నాథ్, చార్మిలు కూడా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా దేశ‌మంతా తిరుగుతూ బిజీగా గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ఆగ‌స్టు 14న వ‌రంగ‌ల్ లో ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. ఇదే వేదిక‌పై ద‌ర్శ‌కుడు పూరీ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేశారు. అవి కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Puri Jagannadh

పూరీ జ‌గ‌న్నాథ్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ముందుగా స‌హ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కి, ఇంకా హీరో విజ‌య్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. త‌రువాత త‌న భార్య చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేస్తూ ఆమె త‌న‌కి విజ‌య్ న‌టించిన అర్జున్ రెడ్డి సినిమా చూడ‌మ‌ని చెప్ప‌గా తాను ఆ సినిమా చూశాన‌ని, ఒక 45 నిమిషాల పాటు సినిమా చూడ‌గానే విజ‌య్ న‌ట‌న‌తో ప్రేమ‌లో ప‌డిపోయాన‌ని చెప్పారు. ఆయ‌న ఒక అరుదైన న‌టుడ‌ని, తాను ఇబ్బందుల్లో ఉన్నాన‌ని చెప్ప‌గానే రూ.2 కోట్లు అయ‌నా స‌రే తిరిగి ఇచ్చేయ‌గ‌ల‌డ‌ని తెలిపారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అన‌న్య పాండే పోషించిన పాత్ర కూడా చాలా బ‌ల‌మైన‌ద‌ని చెబుతూ.. మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించిన మైక్ టైస‌న్ గురించి మాట్లాడారు. మొద‌ట తన మూవీలో మైక్ టైస‌న్ న‌టించ‌నున్నార‌ని చెప్పిన‌ప్పుడు త‌న‌ని ఎవ‌రూ న‌మ్మ‌లేదని అన్నారు. ఆయ‌న వేసుకునే చెప్పుల సైజు నంబ‌రు 20 ఉంటుంద‌ని, త‌న‌ది భారీ కాయం అని, త‌న‌కి కూడా మైక్ టైస‌న్ ని సెట్ లో చూడ‌గానే మొద‌ట భ‌యం వేసింద‌ని చెప్పుకొచ్చారు.

త‌రువాత ఆయ‌న చార్మి గురించి మాట్లాడుతూ ఆమె షూటింగ్ లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న దాకా రానివ్వ‌ద‌ని త‌నే సొంతంగా అన్నీ హ్యాండిల్ చేసుకోగ‌ల‌ద‌ని అన్నారు. దుఃఖంలో కూడా ఒంట‌రిగానే ఉంటుంద‌ని, త‌న వ‌ల్లే చిత్ర షూటింగ్ ప్ర‌శాంతంగా చేసుకోగ‌లిగామ‌ని, కాబ‌ట్టి ఐ ల‌వ్ యూ చార్మి.. అని వాఖ్యానించారు. ఇంకా విజ‌య్ త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ పోషించిన పాత్రలో రెబ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని, ఆ పాత్ర అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని తెలిపారు.

పూరీ క‌నెక్ట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా హిందీలో ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ స‌హ‌కారంతో ఎన్నో అంచ‌నాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM