Puri Jagannadh : పూరీ జ‌గ‌న్నాథ్ బెదిరింపుల ప‌ర్వం.. నిజ‌మేనా..? ఆడియోలో ఏముంది..?

October 26, 2022 8:37 AM

Puri Jagannadh : విజయ్‌ దేవరకొండ టైటిల్‌ రోల్‌ పోషించిన పాన్‌ ఇండియా మూవీ లైగర్. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఊహించని ఫెయిల్యూర్‌ టాక్‌ మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేనంత నష్టం తెచ్చిపెట్టినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలైన ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం పంపిణీ మొదలుపెట్టినట్టు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆడియో ప్రకారం పూరీ, ఛార్మీ ఇంకా వారికి నష్టపరిహారం చెల్లించలేదట. బయ్యర్లు చాలా కోపంగా ఉన్నారని, 2 నెలలు దాటినా తమకు క్లియరెన్స్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వారు ధర్నాకు దిగుతున్నారని, మీటింగ్ లు పెట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఈ క్రమంలో దీపావళి రోజు పూరీ  వాళ్లకి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందంటే.. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా..? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయ్యర్స్ తో మాట్లాడ్డం జరిగింది. మన ఒప్పందం ప్రకారం చెప్పిన మొత్తాన్ని ఒక నెలలో ఇస్తాను. అలా చెప్పాక కూడా మళ్లీ ఇలా చేస్తుంటే ఇవ్వాలని అనిపించదు.

Puri Jagannadh reportedly given warning to distributors
Puri Jagannadh

అయినా మేం ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని సినిమాలు ఆడతాయి కొన్ని సినిమాలు పోతాయి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో వుంది. బయ్యర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూల్ చేసి పెడుతుందా? ధర్నా చేస్తాం అంటున్నారు చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకొని, వాళ్ళకి తప్పా మిగతా వాళ్ళకి ఇస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఓ ఆడియో కాల్, మెసెజ్ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతుందో పూరీకే తెలియాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now