Puri Jagannadh : పూరీ జగన్నాథ్ ఫ్యాన్.. ఆనందం త‌ట్టుకోలేక ఏడ్చేశాడు..

October 25, 2021 9:24 PM

Puri Jagannadh : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌ర‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగానే కాకుండా.. నిర్మాత‌గానూ స‌త్తా చాటుతున్నారు. చివ‌రిగా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను త‌న ఖాతాలో వేసుకున్న పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా లైగ‌ర్ అనే చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది.

Puri Jagannadh fan cried in front of him for happiness

గ‌త కొద్ది రోజులుగా లైగ‌ర్ చిత్రం ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే పూరీ, ఛార్మీలు కారులో ప్ర‌యాణిస్తుండ‌గా, ట్రాఫిక్ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర వారి కారు ఆగింది. టీఎస్ వాహనం చూసి, మన తెలుగు వాళ్ళు అని అనుకున్న ప్ర‌మోద్ అనే అభిమాని పూరీని ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు. ఆనందం త‌ట్టుకోలేక క‌న్నీరు కూడా పెట్టుకున్నాడు. తన దగ్గర ఫోన్ లేకపోవడం తో సెల్ఫీ తీసుకోవడం కుదరలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు.

వెళుతూ వెళుతూ ఛార్మీని ట్విట్ట‌ర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయ‌మ‌ని కోరాడు. దీంతో ఛార్మి ప్ర‌మోద్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ముంబై ట్రాఫిక్ సిగ్న‌ల్ ద‌గ్గ‌ర ఈ క్యూట్ కిడ్ పూరీని క‌లిశాడు. ఈ పోస్ట్ స్పెష‌ల్‌గా ప్ర‌మోద్ కోస‌మే. పూరీతో సెల్ఫీదిగ‌డానికి త‌న ద‌గ్గ‌ర ఫోన్ లేద‌ని చెప్పాడు. అందుకే నా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాన‌ని అన్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now