Puri Jagannadh Assistant Director : పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ ఆత్మహత్య.. కార‌ణం ఏమిటి..?

Puri Jagannadh Assistant Director : టాలీవుడ్ సెన్సేషల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గం చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.

ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పని చేస్తున్నాడా లేదా అనే కోణంపై దర్యాప్తు చేయవలసి ఉంద‌ని పోలీసులు వెల్లడిస్తున్నారు.

Puri Jagannadh Assistant Director

ఇటీవల విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసింద‌ని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వస్తుంది అని ఆశ పడ్డాడు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశ‌లయ్యాయి.

లైగర్ చిత్రాన్ని  పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు సంయుక్తంగా నిర్మించారు. దీంతో వారు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టగా రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ వసూలు చేసింది. ఇంకా రూ.70 కోట్లు వృథాగా పోయాయి. నిర్మాతలకు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీ విశ్లేషక వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. నిర్మాతల‌ను కూడా ఈ చిత్రం భారీ నష్టాలతో నిలువునా ముంచేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM