Puri Jagannadh : పూరీ, ఛార్మి మధ్య ఉన్న అనుబంధం గురించి స్పష్టత ఇచ్చిన ఆకాష్ పూరీ..!

November 1, 2021 11:30 PM

Puri Jagannadh : గత కొన్ని సంవత్సరాల వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా కొనసాగిన ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఛార్మి గత కొద్దికాలం నుంచి సినిమాలలో హీరోయిన్ గా నటించడం లేదు. అయితే ఆమె తెరపై సందడి చేయకున్నప్పటికీ తెర వెనుక ఎంతో బిజీగా ఉందని చెప్పవచ్చు.

Puri Jagannadh and charmme relationship explained by akash puri

ప్రస్తుతం నిర్మాతగా మారిన చార్మి.. పూరీ జగన్నాథ్ తో కలిసి పలు చిత్రాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి హీరోయిన్ గా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ద్వారా పూరీ జగన్నాథ్, చార్మి మధ్య ఎంతో చనువు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి అప్పట్లో పెద్దఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీరి గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై చార్మి, పూరీ ఎప్పుడూ స్పందించలేదు.

తాజాగా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్.. చార్మి, పూరీ మధ్య అందరూ అనుకున్నటువంటి ఏ సంబంధం లేదని, వారిద్దరి మధ్య వేరే బంధం ఉందని స్పష్టత ఇచ్చాడు.

నాన్న సినిమా షూటింగ్ లో ఉంటే ఏ విషయం గురించీ పట్టించుకోరు. అయితే నాన్నకు ఏం కావాలో ఛార్మికి బాగా తెలుసని చార్మి నాన్న పక్కన ఉండటం వల్ల నాన్నకు ఎంతో పని ఒత్తిడి తగ్గిందని ఈ సందర్భంగా ఆకాష్ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలియజేశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now