Puneeth Rajkumar : పునీత్ పాత వీడియోలు చూసి క‌న్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్

October 30, 2021 8:16 PM

Puneeth Rajkumar : క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్ త‌న‌యుడు పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. పునీత్ హఠాన్మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదంలో మునిగిపోయింది. అభిమానులు సొంతింటి మ‌నిషిని కోల్పోయిన‌ట్టు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ప్ర‌ముఖులు సైతం పునీత్ లేర‌ని తెలిసి బాధ‌ప‌డుతున్నారు. పునీత్ ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు కదిలారు.

Puneeth Rajkumar old videos making fans cry more

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ , ఎన్టీఆర్, రానా.. పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, హీరో శ్రీకాంత్, అలీ బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్నారు. పునీత్ పార్ధీవదేహాన్ని సందర్శించిన చిరంజీవి, వెంకటేష్, అలీ, శ్రీకాంత్ నివాళులర్పించారు. పునీత్ అన్న శివ రాజ్ కుమార్ ను ఓదార్చారు చిరు.

https://twitter.com/beastoftraal/status/1454088369684709386

పునీత్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న జ్ఞాపకాల‌ని నెమ‌ర‌వేసుకుంటున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన వీడియోలు కొన్ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. యువ‌ర‌త్న సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా కొంద‌రు డై హార్డ్ ఫ్యాన్స్ పునీత్ అంటే త‌మ‌కు ఎంత ఇష్ట‌మో చెప్పుకొచ్చారు. ఆ స‌మ‌యంలో వెన‌క నుండి వచ్చిన పునీత్ వారికి స‌ర్‌ప్రైజ్ ఇచ్చి సంతోష పెట్టారు. ఆ క్లిప్స్ చూస్తే ఫ్యాన్స్‌కి, పునీత్ మ‌ధ్య ఎంత బాండింగ్ ఉందో అర్ధ‌మ‌వుతోంది. ఈ క్లిప్స్ చూసి అభిమానులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now