Puneeth Rajkumar : పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరి ట్వీట్‌ వైరల్‌.. ఆయన ఏం చెప్పారంటే..?

October 30, 2021 8:37 AM

Puneeth Rajkumar : కన్నడ పవర్‌స్టార్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్త ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ హీరోయే. ఎంతో మందిని చేరదీసి ఆశ్రయం ఇస్తున్నారు. మరెంతో మందిని దత్తత తీసుకుని చదువు చెప్పిస్తున్నారు. అలాంటి ఆయన హఠాన్మరణం ఎంతో మందిని శోక సంద్రంలో నింపింది.

Puneeth Rajkumar last tweet going viral in social media

పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఎల్లప్పుడూ వ్యాయామం చేస్తుంటారు. అందులో భాగంగానే జిమ్‌లో ఎక్కువగా గడుపుతుంటారు. ఫిట్‌ నెస్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఫిట్‌గా ఉంటారు. అయితే ఆయన జిమ్‌ చేస్తూనే కుప్పకూలి పడిపోయి.. అనంతరం హాస్పిటల్‌లో చేరి.. కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూశారు. దీంతో ఆయన మరణవార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్లప్పుడూ ఫిట్‌గా కనిపించే ఆయన ఇలా గుండెపోటుతో చనిపోవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

కాగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ చేసిన చివరి ట్వీట్‌ ఏది ? అంటూ నెటిజన్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పునీత్‌ ద్విత్వ అనే మూవీలో నటిస్తుండగా.. ఆయన సోదరుడు శివరాజ్‌ కుమార్‌ నటించిన భజరంగి 2 చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఆయన చివరిసారిగా ట్వీట్‌ చేశారు. దీంతో పునీత్‌ చివరి ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఏది ఏమైనా.. ఆయన ఆకస్మిక మరణం మాత్రం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now