Puneeth Rajkumar : పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌కి గుండెపోటు.. పరిస్థితి విషమం..

October 29, 2021 1:18 PM

Puneeth Rajkumar : కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ అనే ఇమేజ్ తో గుర్తింపు పెంచుకొని స్టార్ హీరోగా సాగుతున్నాడు పునీత్ రాజ్‌కుమార్. కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్ వుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తున్నారు. స్వతహాగా మంచి డాన్సర్ కూడా కావడంతో పునీత్ రాజ్ కుమార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈయనతో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా నిర్మాతలు భావిస్తారు.

Puneeth Rajkumar got heart attack admitted in icu

ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితిపై కన్నడ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఆయ‌న కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now