Puneeth Rajkumar : నా గుండె పగిలింది.. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణంపై సోనూసూద్‌ స్పందన..

October 29, 2021 2:58 PM

Puneeth Rajkumar : క‌న్న‌డ నాట ప్ర‌జ‌లు శోక‌సంద్రంలో నిండిపోయారు. తాము ఎంత‌గానో అభిమానించే న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో హఠాన్మ‌రణం చెంద‌డాన్ని అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్ప‌టికే బెంగ‌ళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్ వ‌ద్ద‌కు పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోగా.. ఇక ఆయ‌న లేరు ఆయ‌న విష‌యాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Puneeth Rajkumar death shocked celebrities response in twitter

శుక్ర‌వారం ఉద‌యం జిమ్ చేస్తూ హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిన పునీత్ రాజ్ కుమార్‌ను బెంగ‌ళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స‌ను అందిస్తున్నామ‌ని, ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే ఇంత‌లోనే ఆయ‌న మ‌ర‌ణ‌వార్త అంద‌రినీ క‌ల‌చివేస్తోంది.

పునీత్ రాజ్ కుమార్ మృతి ప‌ట్ల ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం తెలిపారు. హీరో నితిన్, సోనూసూద్‌, ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌తోపాటు తారాలోకం అంతా పునీత్ మృతి ప‌ట్ల దిగ్భ్రాంతికి గురైంది. అంద‌రూ ఆయ‌న కుటుంబానికి త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. పునీత్‌ సడెన్‌గా మృతి చెందడం తనను షాక్‌కు గురి చేసిందని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి.. అని నితిన్‌ ట్వీట్  చేశారు.

నా గుండె పగిలింది, నిన్ను మిస్‌ అవుతున్నాను బ్రదర్‌.. అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. పునీత్‌ మరణం షాక్‌కు గురి చేసిందని, ఇంత సడెన్ గా ఆయన చనిపోవడం బాధగా ఉందని, మరణం అనేది ఎప్పుడైనా, ఎవరికైనా, ఎలాగైనా రావచ్చని.. ఉన్నంత కాలం హ్యాపీగా జీవించాలని.. రామ్‌ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు.

కాసేప‌ట్లో సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ప్రెస్ మీట్ లో మాట్లాడ‌నున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని కంఠీర‌వ స్టేడియానికి అభిమానుల సంద‌ర్శ‌నార్థం త‌ర‌లిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now