Pune : ఓ వ్యక్తి బిజినెస్ ట్రిప్ మీద వేరే ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పి భార్యను మోసం చేశాడు. తన ప్రియురాలితో కలిసి వేరే ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. అయితే అతనిపై ముందుగానే నిఘా ఉంచిన అతని భార్య అతన్ని అన్ని ఆధారాలతో సహా పట్టుకుంది. వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి (41) బిజినెస్ చేస్తుంటాడు. బిజినెస్ ట్రిప్ మీద బెంగళూరు వెళ్తున్నానని చెప్పి తన ప్రియురాలితో కలిసి అతను పూణె వెళ్లాడు. అయితే అతనిపై ముందు నుంచీ అనుమాన పడిన అతని భార్య అతని కారులో జీపీఎస్ డివైస్‌ను ఫిట్ చేయించింది. దీంతో అతను ఎక్కడికి వెళ్లిందీ.. సులభంగా తెలిసిపోయింది.
ఎంక్వయిరీ చేయగా.. అతను తన ప్రియురాలిని తీసుకుని పూణెలోని ఓ హోటల్‌కు వెళ్లాడని అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేస్తే తెలిసింది. ఇక ఆ హోటల్‌లో దిగేందుకు గాను ఆ వ్యక్తి తన ప్రియురాలినే తన భార్యగా చెప్పాడు. అందుకు సాక్ష్యంగా తన భార్య ఆధార్ కార్డును ఆమెకు వాడాడు. ఈ క్రమంలో అతని భార్య ఆ హోటల్‌కు వచ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు ఇతర వివరాలను సేకరించింది. వాటితో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ వ్యక్తి, అతని ప్రియురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…