Pune : బిజినెస్ ట్రిప్ అని చెప్పి ప్రియురాలితో హోట‌ల్‌కు వెళ్లిన వ్య‌క్తి.. చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న భార్య‌..!

February 4, 2022 6:10 PM

Pune : ఓ వ్య‌క్తి బిజినెస్ ట్రిప్ మీద వేరే ప్రాంతానికి వెళ్తున్నాన‌ని చెప్పి భార్య‌ను మోసం చేశాడు. త‌న ప్రియురాలితో క‌లిసి వేరే ప్రాంతంలో ఉన్న ఓ హోట‌ల్‌కు వెళ్లి ఎంజాయ్ చేశాడు. అయితే అత‌నిపై ముందుగానే నిఘా ఉంచిన అత‌ని భార్య అత‌న్ని అన్ని ఆధారాల‌తో స‌హా ప‌ట్టుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

Pune wife caught her husband with his girl friend using technology
Pune

గుజ‌రాత్‌కు చెందిన ఓ వ్య‌క్తి (41) బిజినెస్ చేస్తుంటాడు. బిజినెస్ ట్రిప్ మీద బెంగ‌ళూరు వెళ్తున్నాన‌ని చెప్పి త‌న ప్రియురాలితో క‌లిసి అత‌ను పూణె వెళ్లాడు. అయితే అత‌నిపై ముందు నుంచీ అనుమాన ప‌డిన అత‌ని భార్య అత‌ని కారులో జీపీఎస్ డివైస్‌ను ఫిట్ చేయించింది. దీంతో అత‌ను ఎక్క‌డికి వెళ్లిందీ.. సుల‌భంగా తెలిసిపోయింది.

ఎంక్వ‌యిరీ చేయ‌గా.. అత‌ను త‌న ప్రియురాలిని తీసుకుని పూణెలోని ఓ హోట‌ల్‌కు వెళ్లాడ‌ని అక్క‌డి సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేస్తే తెలిసింది. ఇక ఆ హోట‌ల్‌లో దిగేందుకు గాను ఆ వ్య‌క్తి త‌న ప్రియురాలినే త‌న భార్య‌గా చెప్పాడు. అందుకు సాక్ష్యంగా త‌న భార్య ఆధార్ కార్డును ఆమెకు వాడాడు. ఈ క్ర‌మంలో అత‌ని భార్య ఆ హోట‌ల్‌కు వ‌చ్చి ఆ సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు ఇత‌ర వివ‌రాల‌ను సేక‌రించింది. వాటితో పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ వ్య‌క్తి, అత‌ని ప్రియురాలు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now