PUBG New State : పబ్‌జి ప్రేమికులకు దక్షిణ కొరియా గేమ్ డెవలపర్ సంస్థ క్రాఫ్టన్ గుడ్ న్యూస్ చెప్పింది. పబ్‌జి కొత్త గేమ్ పబ్‌జి న్యూస్టేట్‌ను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన పబ్‌జి గేమ్స్ మాదిరిగానే ఈ గేమ్ ఉంటుంది. అదే పాత పద్ధతిలోనే 100 మంది ప్లేయర్లు బ్యాటిల్ ఫీల్డ్‌లో పోరాడుతారు. అయితే గేమ్ మాత్రం అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్లేయర్లు పొందే ఐటమ్స్ కూడా వేరేగా ఉంటాయి.
పబ్‌జి న్యూ స్టేట్ గేమ్‌కు గాను ఈ ఏడాది ఆగస్టులోనే ఆల్ఫా వెర్షన్‌ను రిలీజ్ చేశారు. తరువాత సెప్టెంబర్‌లో బీటా వెర్షన్‌ను లాంచ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో గేమ్‌ను ప్లేయర్లు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. గతంలో పబ్‌జి మొబైల్ గేమ్ బ్యాన్ కాగా.. దాని స్థానంలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను లాంచ్ చేశారు. అది కూడా బాగానే పాపులర్ అయింది. ఇక కొత్త గేమ్ గేమింగ్ ప్రియులను ఎంతగానో అలరిస్తుందని చెబుతున్నారు.
పబ్‌జి న్యూ స్టేట్ గేమ్‌ను ఆడేవారికి జనవరి 5, 2022 వరకు అనేక రకాల గిఫ్ట్‌లను అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే గేమ్‌లోకి లాగిన్ అయ్యి గిఫ్ట్‌లను రిడీమ్ చేసుకోవచ్చు. కొత్తగా రివార్డులను కూడా అందివ్వనున్నారు.
పబ్‌జి న్యూ స్టేట్ గేమ్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుని ఆడవచ్చు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…