PUBG New State : ప‌బ్‌జి కొత్త గేమ్‌.. ప‌బ్‌జి న్యూ స్టేట్ వ‌చ్చేసింది..!!

November 11, 2021 3:34 PM

PUBG New State : ప‌బ్‌జి ప్రేమికుల‌కు ద‌క్షిణ కొరియా గేమ్ డెవ‌ల‌ప‌ర్ సంస్థ క్రాఫ్ట‌న్ గుడ్ న్యూస్ చెప్పింది. ప‌బ్‌జి కొత్త గేమ్ ప‌బ్‌జి న్యూస్టేట్‌ను లాంచ్ చేసింది. గ‌తంలో వ‌చ్చిన ప‌బ్‌జి గేమ్స్ మాదిరిగానే ఈ గేమ్ ఉంటుంది. అదే పాత ప‌ద్ధ‌తిలోనే 100 మంది ప్లేయ‌ర్లు బ్యాటిల్ ఫీల్డ్‌లో పోరాడుతారు. అయితే గేమ్ మాత్రం అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప్లేయ‌ర్లు పొందే ఐట‌మ్స్ కూడా వేరేగా ఉంటాయి.

PUBG New State new game launched by krafton

ప‌బ్‌జి న్యూ స్టేట్ గేమ్‌కు గాను ఈ ఏడాది ఆగ‌స్టులోనే ఆల్ఫా వెర్ష‌న్‌ను రిలీజ్ చేశారు. త‌రువాత సెప్టెంబ‌ర్‌లో బీటా వెర్ష‌న్‌ను లాంచ్ చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో గేమ్‌ను ప్లేయ‌ర్లు అంద‌రికీ అందుబాటులోకి తెచ్చారు. గ‌తంలో ప‌బ్‌జి మొబైల్ గేమ్ బ్యాన్ కాగా.. దాని స్థానంలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ను లాంచ్ చేశారు. అది కూడా బాగానే పాపుల‌ర్ అయింది. ఇక కొత్త గేమ్ గేమింగ్ ప్రియుల‌ను ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు.

ప‌బ్‌జి న్యూ స్టేట్ గేమ్‌ను ఆడేవారికి జ‌న‌వ‌రి 5, 2022 వ‌ర‌కు అనేక ర‌కాల గిఫ్ట్‌ల‌ను అందివ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే గేమ్‌లోకి లాగిన్ అయ్యి గిఫ్ట్‌ల‌ను రిడీమ్ చేసుకోవ‌చ్చు. కొత్త‌గా రివార్డుల‌ను కూడా అందివ్వ‌నున్నారు.

ప‌బ్‌జి న్యూ స్టేట్ గేమ్ ను గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో యూజ‌ర్లు డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుని ఆడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now