Prudhvi Raj : మంచు విష్ణు ఏం చేసినా పక్కా ప్లాన్ ప్ర‌కారం చేస్తాడు : క‌మెడియ‌న్ పృథ్వి

May 17, 2022 9:38 AM

Prudhvi Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ఒక్క కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్ట‌లేదు. మ‌రోవైపు ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి పోరాటం చేయ‌లేదు. దీంతో ఈ మ‌ధ్య కాలంలో మంచు ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే అలాంటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా మంచు విష్ణు ప్ర‌స్తుతం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందులో భాగంగానే ఆయ‌న ఇటీవ‌ల మా స‌భ్యుల‌కు ఏఐజీ హాస్పిట‌ల్స్ స‌హ‌కారంతో ప్ర‌త్యేక మెడిక‌ల్ క్యాంప్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

6 నెల‌ల్లో మా అసోసియేష‌న్ బిల్డింగ్ కు భూమి పూజ చేస్తామ‌ని మంచు విష్ణు ఈ సంద‌ర్భంగా అన్నారు. అలాగే టిక్కెట్ల ధ‌ర‌ల‌పై కూడా అంద‌రూ క‌ల‌సి కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుంద‌ని అన్నారు. ఇక ఇదే కార్య‌క్ర‌మంలో క‌మెడియ‌న్ పృథ్వి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మంచు విష్ణును పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు. మంచు విష్ణు ఒక ప్లానింగ్ ఉన్న వ్యక్తి అని.. ఆయ‌న ఏం చేసినా ఒక ప్లాన్ ప్ర‌కారం చేస్తార‌ని అన్నారు.

Prudhvi Raj praised Manchu Vishnu for his work
Prudhvi Raj

మంచు విష్ణు ఇప్ప‌టికే త‌మ‌కు ఉన్న విద్యాసంస్థ‌ల‌ను ఎంతో సుల‌భంగా నిర్వ‌హిస్తున్నార‌ని.. క‌నుక మా అసోసియేష‌న్‌ను నిర్వ‌హించ‌డం అత‌నికి పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని.. చాలా సుల‌భంగా ప‌నిచేయ‌గ‌ల‌డ‌ని అన్నారు. ఇక పృథ్వి ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవిపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను మొద‌టి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానినే అని.. కొంద‌రి ప్రోద్బ‌లం వల్ల వారికి వ్య‌తిరేకంగా వెళ్లాల్సి వ‌చ్చింద‌ని.. త‌ను మెగాస్టార్ ఆదుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now