Prudhvi Raj : భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు భరణం అనేది భర్తకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరీ ముఖ్యంగా భర్త బాగా సంపాదించే వాడో లేక సినీ నటులో అయితే అది భారీ మొత్తంలో ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఈ భరణం చెల్లించే విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. భరణం చెల్లించడంలో తేడాలు వస్తే మగవారు జైలుకి కూడా వెళ్ల వలసి వస్తుంది. ఇలాంటి సంఘటనలు అక్కడ సర్వ సాధారణంగా మనం వింటూనే ఉంటాం. అయితే తెలుగు నటుడు, కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ విషయంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పునే ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నటుడు పృథ్వీకి శ్రీలక్ష్మీ అనే ఆమెతో 1984 లో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు. అయితే 2016లో పృథ్వీ తనను ఇంటి నుంచి గెంటివేశాడని అప్పటినుండి తన తల్లిదండ్రులతో జీవిస్తున్నాని ఆమె కోర్టుకి తెలిపింది. కాగా ఈ విడాకుల కేసు సందర్భంగా ఆమె కోర్టుకు సమర్పించిన స్టేట్ మెంట్ లో.. తన భర్త పృథ్వీ సినిమాలు, షోలు, సీరియల్స్ ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిపింది. కాబట్టి తనకు భరణం ఇప్పించాలని కోరింది. ఈ క్రమంలో వాదనలను పరిశీలించిన విజయవాడ ఫ్యామిలీ కోర్టు నెలకు 8 లక్షల రూపాయలు ఆమెకు భరణం చెల్లించాలని పృథ్వీని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రతి నెల 10లోగా తనకు భరణం ఇవ్వాలని ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగింది.
అయితే దీనిపై నెటిజనులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. పృథ్వీ జనసేన పార్టీలో చేరినప్పటి నుండి తన జీవితంలో కూడా కొత్త ట్విస్టులు రావడం జరుగుతుందని జోకులు పేలుస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…