Priyamani : గ్లామర్‌ ఫొటోషూట్‌తో అలరిస్తున్న ప్రియమణి..!

February 2, 2022 3:45 PM

Priyamani : ఒకప్పుడు అనేక హిట్‌ చిత్రాల్లో నటించిన ప్రియమణి ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదు. కానీ వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. ఇక అప్పుడప్పుడు ఈమె గ్లామర్‌ షో చేస్తూ ఫొటోషూట్‌లు చేస్తుంటుంది. పెళ్లయినా ఈమె అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

Priyamani latest photos trending
Priyamani

ప్రియమణి తాజాగా చేసిన ఫొటోషూట్‌ తాలూకు ఫొటోలు వైరల్‌గా మారాయి. నేవీ బ్లూ కలర్‌ మిడ్డీ, అందుకు తగిన మ్యాచింగ్‌ టాప్‌ వేసుకుని దిగిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

ప్రియమణి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోని ఊపేసింది. ఇప్పుడు ఓటీటీలు, సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా మారింది. ఈమె నటించి లేటెస్ట్‌ మూవీ భామా కలాపం. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే విడుదల కాగా.. అది వెరైటీ ఉండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఈ నెల 11వ తేదీన ఆహాలో స్ట్రీమ్‌ కానుంది.

ప్రియమణి సిరీస్‌లలో కూడా నటిస్తూ అలరిస్తోంది. గతంలో ఈమె చేసిన ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో ఈ సిరీస్‌ ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now