Preity Zinta : సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ ప్రేక్షకులకి కూడా సుపరిచితం. ఈ అమ్మడు సినిమాలతోపాటు బిజినెస్ వ్యవహారాలలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ ద్వారా ప్రీతి జింతా వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. తాజాగా ఈ అమ్మడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
2016లో ప్రీతి జింతా ఫారెన్ బిజినెస్ మ్యాన్ జీన్ గుడెనఫ్‌ని పెళ్లి చేసుకోగా, సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఈ హ్యాపీ న్యూస్ ని స్వయంగా ప్రీతి జింతా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ‘హాయ్.. ఈరోజు మీతో నేను ఒక అమేజింగ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను. నేను, జీన్ ఎంతో సంతోషంతో ఈ వార్తని ప్రకటిస్తున్నాం.
మా జీవితాల్లో సంతోషం, వెలుగు నిండేలా కవల పిల్లలని పొందాము. ఈ కొత్త ప్రయాణం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సరోగసి ద్వారా మాకు పిల్లలు పుట్టడంలో సహకరించిన డాక్టర్లు, నర్సులకు ధన్యవాదాలు’ అని ప్రీతి జింతా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. తన కవల పిల్లలకు ‘జై జింతా గుడెనఫ్’, ‘జియా జింతా గుడెనఫ్’ అనే పేర్లతో నామకరణం చేసినట్లు ప్రీతి జింతా ప్రకటించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…