Pranitha Subhash : భ‌ర్త మీద‌కు ఎక్కిన ప్ర‌ణీత‌.. ప్రెగ్నెంట్ అంటూ షాకిచ్చిన బాపు బొమ్మ‌..!

April 11, 2022 4:51 PM

Pranitha Subhash : బాపు బొమ్మ ప్ర‌ణీత తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్ర‌ముఖ హీరోల‌ స‌ర‌స‌న న‌టించి మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. సిద్ధార్థ్‌తో న‌టించిన బావ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్ర‌ణీత‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది, మ‌హేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స, మంచు విష్ణుతో పాండ‌వులు పాండ‌వులు తుమ్మె”, రామ్‌తో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే.. చిత్రాల‌తో అల‌రించింది. సినిమాలే కాదు సేవా కార్య‌క్ర‌మాల‌తోనూ ప్ర‌ణీత అంద‌రి మ‌న‌సుల‌లోనూ చెర‌గ‌ని ముద్ర వేసింది.

Pranitha Subhash got pregnant happy with her husband
Pranitha Subhash

క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కార్మికులు, పేద‌ల‌కు స‌హాయం చేసి త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. సొంత ఖ‌ర్చుతో చాలా మందిని ఆదుకుంది. గ‌తేడాది హంగామా2, భూజ్ సినిమాల‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్ర‌స్తుతం ఆమె క‌న్న‌డలో న‌టిస్తున్న రావ‌ణ అవ‌తార చిత్రం షూటింగ్ ద‌శలో ఉంది. అయితే గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్‌డేట్‌ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్‌ఫ్యూజ‌న్‌ ఉండడంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

నితిన్, సుభాష్ వివాహం చేసుకుని ఇప్ప‌టికీ ఏడాది కూడా పూర్తవ్వలేదు. కానీ ఈలోపే ప్రణీత తన అభిమానుల‌కు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

ఓ ఫొటోలో భ‌ర్త మీద‌కు ఎక్కి త‌న గ‌ర్భానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్ చూపిస్తుండ‌గా, మ‌రో ఫొటోలో టెస్ట్ చేసుకున్న శాంపిల్ ను వారు చూపించారు. తల్లి కాబోతున్న ఆనందంలో భర్త పైకెక్కి నేలదిగనంటూ మారాం చేసింది. భర్త నితిన్ 34వ పుట్టిన రోజు సందర్భంగా ప్రణీత ఈ గుడ్ న్యూస్ ను తన అభిమానులతో పంచుకుంది. నా భర్త 34వ పుట్టినరోజు సందర్భంగా పైన ఉన్న దేవదూతలు మాకు బహుమతిని ఇచ్చారు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment