Pranitha Subhash : నటి ప్రణీత ఈ మధ్య కాలంలో తన బేబీ బంప్ ఫొటోలతో తరచూ వార్తల్లో నిలిచింది. అయితే ఈమె తాజాగా పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. కరోనా సమయంలో అతిథులు ఎవరూ లేకుండానే వివాహం చేసుకున్న ఈమె ఒక్కసారిగా తన పెళ్లి విషయం చెప్పి అందరికీ షాకిచ్చింది. తరువాత గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నటి ప్రణీత నితిన్ రాజు అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుంది. అయితే వివాహం అయ్యాక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ ఈమె భవిష్యత్తులో సినిమాల్లో నటిస్తుందా.. లేదా.. అన్న విషయంపై అయితే స్పష్టత రాలేదు. అయితే బిడ్డ జన్మించాక ప్రణీత ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చూస్తూ మురిసిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా ప్రణీత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన బిడ్డ ఫొటోను జత చేసి దానికి ఒక కామెంట్‌ను పెట్టింది. గత కొద్ది రోజులుగా తాను పడ్డ బాధ అంతా ఇంతా కాదని.. అయితే తన బిడ్డ జన్మించగానే ఆ బాధనంతా మర్చిపోయానని తెలియజేసింది. తన డెలివరీకి సహకరించిన గైనకాలిజస్టు డాక్టర్ జయశ్రీ, డాక్టర్ సునీల్ ఈశ్వర్, మత్తు డాక్టర్ సుబ్బు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసింది. కాగా ప్రణీత బెంగళూరులోని ఆస్టర్ ఆర్‌వీ హాస్పిటల్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…