Pranitha Subhash : పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన న‌టి ప్ర‌ణీత‌.. ఫొటో వైర‌ల్‌..!

June 11, 2022 11:29 AM

Pranitha Subhash : న‌టి ప్ర‌ణీత ఈ మ‌ధ్య కాలంలో త‌న బేబీ బంప్ ఫొటోల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచింది. అయితే ఈమె తాజాగా పండంటి ఆడ‌శిశువుకు జ‌న్మ‌నిచ్చింది. క‌రోనా స‌మ‌యంలో అతిథులు ఎవ‌రూ లేకుండానే వివాహం చేసుకున్న ఈమె ఒక్క‌సారిగా త‌న పెళ్లి విష‌యం చెప్పి అంద‌రికీ షాకిచ్చింది. త‌రువాత గ‌ర్భం దాల్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆమెకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

న‌టి ప్ర‌ణీత నితిన్ రాజు అనే వ్యాపార వేత్త‌ను వివాహం చేసుకుంది. అయితే వివాహం అయ్యాక సినిమాల‌కు ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ ఈమె భ‌విష్య‌త్తులో సినిమాల్లో న‌టిస్తుందా.. లేదా.. అన్న విష‌యంపై అయితే స్ప‌ష్ట‌త రాలేదు. అయితే బిడ్డ జ‌న్మించాక ప్ర‌ణీత ఆమెను త‌న చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చూస్తూ మురిసిపోయింది. ఈ క్ర‌మంలోనే ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Pranitha Subhash blessed with baby girl
Pranitha Subhash

ఈ సంద‌ర్భంగా ప్ర‌ణీత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో త‌న బిడ్డ ఫొటోను జ‌త చేసి దానికి ఒక కామెంట్‌ను పెట్టింది. గ‌త కొద్ది రోజులుగా తాను ప‌డ్డ బాధ అంతా ఇంతా కాద‌ని.. అయితే త‌న బిడ్డ జ‌న్మించ‌గానే ఆ బాధ‌నంతా మ‌ర్చిపోయాన‌ని తెలియ‌జేసింది. త‌న డెలివ‌రీకి స‌హ‌క‌రించిన గైన‌కాలిజ‌స్టు డాక్ట‌ర్ జ‌య‌శ్రీ‌, డాక్ట‌ర్ సునీల్ ఈశ్వ‌ర్‌, మ‌త్తు డాక్ట‌ర్ సుబ్బు, ఇత‌ర సిబ్బందికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది. కాగా ప్ర‌ణీత బెంగ‌ళూరులోని ఆస్ట‌ర్ ఆర్‌వీ హాస్పిట‌ల్‌లో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రిటీలు, ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment