Prakash Raj : సాయి ప‌ల్ల‌వికి ప్ర‌కాష్ రాజ్ స‌పోర్ట్‌.. భారీ ఎత్తున మ‌ళ్లీ మొద‌లైన ట్రోలింగ్‌..

June 19, 2022 3:06 PM

Prakash Raj : ఫిదా సినిమాతో హైబ్రిడ్ పిల్ల‌గా పేరు తెచ్చుకున్న సాయిప‌ల్ల‌వి ఈ మ‌ధ్య అన‌వ‌స‌రంగా ఓ వివాదంలో చిక్కుకున్న విష‌యం విదిత‌మే. కాశ్మీర్ లో కాశ్మీర్ పండిట్ల హ‌త్య‌ల‌కు, గోహ‌త్య‌ల‌కు పెద్ద‌గా తేడా ఏమీ లేద‌ని.. రెండూ ఒక‌టేన‌ని సాయిప‌ల్ల‌వి కామెంట్స్ చేయ‌డంతో ఓ వ‌ర్గం వారు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. బీజేపీ స‌హా.. హిందూ సంఘాలు, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ఆమె కామెంట్స్‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశాయి. వెంట‌నే సాయిప‌ల్ల‌వి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్లో తెలిసీ తెలియ‌కుండా కామెంట్స్ చేయ‌డం సరికాద‌ని హిత‌లు ప‌లికారు.

అయితే త‌న‌పై వ‌స్తున్న ట్రోలింగ్‌, విమ‌ర్శ‌ల‌కు సాయి ప‌ల్ల‌వి స్పందించింది. త‌న కామెంట్స్‌పై వివ‌ర‌ణ ఇచ్చుకుంది. త‌న కామెంట్స్ ఎవ‌రినైనా బాధించి ఉంటే అందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలియ‌జేసింది. త‌న ఉద్దేశం.. హింస అనేది ఏ రూపంలో జ‌రిగినా ఒక్క‌టేన‌ని.. అంద‌రం ముందుగా మ‌నుషుల‌మ‌ని.. త‌రువాతే మ‌తాలు అని.. ఒక డాక్ట‌ర్‌గా త‌న‌కు ప్రాణం విలువ తెలుస‌ని.. అయితే తాను ముందు వెనుక అన్న మాట‌ల‌ను కాకుండా ఒక స‌మయంలో అన్న మాట‌ల‌ను మాత్ర‌మే చూపించార‌ని.. దీని వ‌ల్ల త‌న కామెంట్స్ త‌ప్పుడుగా జ‌నంలోకి వెళ్లాయ‌ని.. అందుకు సారీ చెబుతున్నాన‌ని.. సాయి ప‌ల్ల‌వి చెప్పింది. అయితే సాయి ప‌ల్ల‌వి సారీ చెప్పి ఈ వివాదానికి అంత‌టితో చెక్ పెట్టింది. కానీ దీన్ని కొంద‌రు వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప్ర‌కాష్ రాజ్ ముగిసిపోయింద‌నుకున్న అంశాన్ని మళ్లీ తెర‌మీద‌కు తెచ్చారు.

Prakash Raj support to Sai Pallavi trolling on him
Prakash Raj

సాయిప‌ల్ల‌వి ఆ కామెంట్స్ చేసినందుకు ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆమె కామెంట్స్ స‌రైన‌వే అన్నారు. దీంతో ప్ర‌కాష్ రాజ్ పై మ‌ళ్లీ ట్రోలింగ్ మొద‌లైంది. భారీ ఎత్తున ఆయ‌నను విమ‌ర్శిస్తున్నారు. వివాదం స‌ద్దుమ‌ణిగింది అనుకుంటున్న స‌మ‌యంలో ప్ర‌కాష్ రాజ్ మ‌ళ్లీ ఇలా ఎందుకు కామెంట్లు చేశారు.. ఆయ‌న గొడ‌వ‌లు పెట్టించాల‌ని చూస్తున్నారా.. అంటూ కొంద‌రు ఆయ‌నను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే ప్ర‌కాష్ రాజ్‌పై మ‌ళ్లీ ఆయా పార్టీలు, సంఘాల‌కు చెందిన నేత‌లు ఏమంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now