గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Prakash Raj : మా ఎన్నిక‌ల్లో వైకాపా మ‌నుషులు..? ఫొటోలు, వీడియోల‌తో నిరూపించే ప్ర‌య‌త్నం..!

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎంత వాడి, వేడిగా జ‌రిగాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విష్ణు ప్యానెల్ గెలిచిన త‌ర్వాత ప్ర‌కాశ్ రాజ్ ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌గా, ఆయ‌న ప్యానెల్ నుంచి గెలుపొందిన స‌భ్యులంద‌రూ…

Prakash Raj : మా ఎన్నిక‌ల్లో వైకాపా మ‌నుషులు..? ఫొటోలు, వీడియోల‌తో నిరూపించే ప్ర‌య‌త్నం..!

Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎంత వాడి, వేడిగా జ‌రిగాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విష్ణు ప్యానెల్ గెలిచిన త‌ర్వాత ప్ర‌కాశ్ రాజ్ ‘మా’ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌గా, ఆయ‌న ప్యానెల్ నుంచి గెలుపొందిన స‌భ్యులంద‌రూ కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ముందు నుండి ఎన్నిక‌లు స‌రిగ్గా జ‌రగ‌లేద‌ని ప్ర‌కాశ్ రాజ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇటీవల పోలింగ్‌ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు.

Prakash Raj says that there are ysrcp leaders in maa elections

ఎన్నికల హాల్‌లోకి వైకాపా కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ.. ప్రశ్నల వర్షం కురిపించారు ప్ర‌కాశ్ రాజ్. మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తులు అక్కడకు వచ్చారని, బయటి వ్యక్తులు అక్కడ ఇబ్బందులు పెట్టారంటూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్లు చెప్పారు. రౌడీ షీటర్ నూకల సాంబశివరావు కూడా ఆ ప్రదేశంలో ఉన్నాడని, అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేయనున్నట్లు ప్రకాష్ రాజ్ చెప్పారు.

తాజా ప‌రిణామంతో ఇండ‌స్ట్రీలో మా ఎల‌క్ష‌న్ విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది. మ‌రి ఇప్పుడు విష్ణు మంచు ప్యానెల్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ‘మా’ ఎన్నిక‌ల్లో అస‌లు రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోలేద‌ని రెండు ప్యానెల్స్‌కు సంబంధించిన స‌భ్యులు తెలియ‌జేస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ప్ర‌కాశ్ రాజ్ ఆధారాల‌తో చూపించ‌డంతో స‌రికొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి