Maa Elections : మా ఎన్నిక‌ల రేసులో ప్ర‌కాష్ రాజ్ వెనుక‌బ‌డుతున్నారా ?

October 9, 2021 4:37 PM

Maa Elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు రాజ‌కీయ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇంకా ఎన్నిక‌ల‌కు ఒక్క రోజు మాత్ర‌మే ఉండ‌డంతో మా అధ్య‌క్ష పీఠం ఎవ‌రికి ద‌క్కుతుంద‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

prakash raj backwards in Maa Elections

అయితే సినీ వ‌ర్గాల్లో న‌డుస్తున్న చ‌ర్చ ప్ర‌కారం.. మా ఎన్నిక‌ల రేసులో ప్ర‌కాష్ రాజ్ వెనుక‌బ‌డ్డార‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఇండ‌స్ట్రీ ప‌రంగా ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్‌పై కొన్ని మ‌చ్చ‌లున్నాయి. ఆయ‌న స‌మ‌యానికి రాడ‌ని, ఫైనాన్షియ‌ర్ల‌కు డ‌బ్బులు ఎగ్గొట్టార‌ని అంటున్నారు. మంచు విష్ణు ప్యానెల్ స‌భ్యులు ప్ర‌కాష్ రాజ్ కు చెందిన ఈ విష‌యాల‌ను ప్ర‌త్య‌క్షంగా నిరూపించారు కూడా.

అయితే విష్ణుకు సంబందించి రిమార్క్‌ల‌ను ఎత్తి చూపడంలో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక సీనియ‌ర్లు, సినీ ఇండ‌స్ట్రీల పెద్దల మ‌ద్ద‌తును కూడ‌గట్ట‌డంలోనూ ప్రకాష్ రాజ్ విఫ‌ల‌మ‌య్యారు. ఆయ‌న వారి మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ని బ‌హిరంగంగానే చెప్పారు. కానీ మంచు విష్ణు మాత్రం అంద‌రు పెద్ద‌ల‌నూ క‌ల‌సి మ‌ద్ద‌తు సాధించారు.

ఈ విధంగా అనేక కార‌ణాల వ‌ల్ల ప్ర‌కాష్ రాజ్ మా ఎన్నిక‌ల రేసులో వెనుక బ‌డ్డార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఎన్నిక‌లు జ‌రిగితే కానీ ఎవ‌రి భ‌విత‌వ్యం ఏమిటి ? అనేది తేల‌దు. అందుకు ఇంకో 48 గంట‌ల పాటు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now