Pragya Jaiswal : కంచె బ్యూటీ అభిమానుల‌కి పండగ లాంటి వార్త చెప్పింది..!

October 19, 2021 8:04 AM

Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య బాబు, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న మాస్ ఎంటర్‌టైనర్ అఖండలో క‌థానాయిక‌గా న‌టించింది. ఈ సినిమా కోసం ప్ర‌గ్యా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

Pragya Jaiswal told good news about her health fans very happy

అయితే రీసెంట్‌గా ఈ అమ్మ‌డు క‌రోనా బారిన ప‌డింది. నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఇంత‌కు ముందు క‌రోనా బారిన ప‌డ్డాను. ఇప్పడు మ‌ళ్లీ క‌రోనా వ‌చ్చింది. ప్ర‌స్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ప్ర‌గ్యాకి కరోనా అని చెప్ప‌డంతో ఆమె టీం అంతా ఆందోళ‌న చెందారు.

తాజాగా ప్ర‌గ్యా జైస్వాల్ గుడ్ న్యూస్ చెప్పింది. నెగిటివ్‌ అనే పదం ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ తనను సంతోష పెట్టలేదు.. అంటూ ట్వీట్ చేసింది ప్రగ్యా జైస్వాల్‌. అంటే త‌న‌కు క‌రోనా నెగెటివ్ అని క‌న్‌ఫాం అయింద‌ని తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ 10వ తేదీన హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రగ్యాకి క‌రోనా నెగెటివ్ అని తేల‌డంతో అభిమానులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now