Pragya Jaiswal : బాలకృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగ్యా జైస్వాల్..!

November 27, 2021 1:59 PM

Pragya Jaiswal : నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన ప్రగ్యా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణపై షాకింగ్ కామెంట్స్‌ చేశారు.

Pragya Jaiswal : బాలకృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగ్యా జైస్వాల్..!
Pragya Jaiswal

తాను ఇప్పటివరకు అన్ని మంచి పాత్రలను ఎంపిక చేసుకున్నానని అయితే అవి ప్రేక్షకులను సందడి చేయడం, చేయకపోవడం మన చేతుల్లో ఉండదని తెలిపారు. అయితే బోయపాటి సినిమాలో బాలకృష్ణ అంతటి సీనియర్ హీరోతో నటించడం ఇదే మొదటి సారి అని, అలాంటి సీనియర్ హీరో సరసన నటించాలంటే మొదట ఇబ్బంది పడ్డానని, అయితే ఆయనను కలిసిన 5 నిమిషాలకే చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యానని తెలిపారు.

బయట బాలకృష్ణ గురించి అందరూ చెప్పిన విధంగా బాలయ్య ఉండరని, ఆయన ఎంతో సరదాగా అందరితోనూ ఉంటారని తెలిపారు. క్రమశిక్షణ విషయంలో మాత్రం బాలకృష్ణ ఎంతో స్ట్రిక్ట్ అని ఆమె తెలిపారు. ఆయన అలా నడుచుకుంటూ సెట్ లోకి వస్తే మిగిలిన వారందరూ సైలెంట్ అయ్యేవారని, అలా ఆయన క్రమశిక్షణ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, అఖండ సినిమాలోని తన పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని, తన పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని.. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now