మళ్లీ రెచ్చిపోయిన ప్రగతి.. ఈ ఏజ్‌లో నీకు ఇవి అవసరమా.. అంటున్న నెటిజన్స్..

August 23, 2022 4:13 PM

వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉంది. ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఒకప్పటి ఆమె ఈమేనా అని భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి ఫిట్‌నెస్ మీద దృష్టి సారించింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తోంది. అవి వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రగతి తన కుడిభుజం మీద కింగ్ నాగార్జున లాగా ఒక టాటూ వేయించుకుంది.

నాగార్జున కంటే కొంచెం పెద్దగా ప్రగతి చేయి ఉంటుంది. దానికి తగ్గట్టుగా అంతే సైజులో టాటూ వేయించుకోవడమే కాకుండా స్లీవ్ జాకెట్స్ ధరించి, ఎద అందాలు ఎక్స్ పోజ్ చేసేలా నటి ప్రగతి షో చేయడం నెటిజన్లకు రుచించడం లేదు. అందుకే ప్రగతి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోలు, ఫోటోలు చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం ఈమె బోల్డ్ రోల్స్ చేస్తుందని, అందుకోసమే ఇలాంటి ఫోటోషూట్ చేయించుకుంటోందని కూడా కొందరు నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా జిమ్‌లో బనియన్ల మీద బాడీ అందాలు కనిపించేలా అలాంటి వీడియోలు ఈ ఏజ్‌లో చేయడం ఎందుకు.. అని కొందరు విమర్శిస్తున్నారు.

Pragathi Dance video viral netizen troll her
Pragathi Dance

బరువు తగ్గాలంటే జిమ్, యోగా అవసరమే. కానీ అందుకోసం ఇలాంటి దుస్తులు ధరించాలా ? అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ శారీ గోల్డ్ కలర్ జాకెట్ వేసుకున్న ప్రగతి రౌండ్ గా తిరుగుతూ డ్యాన్స్ చేస్తోంది. అంతేకాకుండా ఇది ఎవరి కోసమో చేసింది కాదు లోకోద్దారకులారా ? నాకోసం చేసిందంటూ డిఫరెంట్‌గా కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా అంతేస్థాయిలో ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమాల్లో నటించడం కంటే సోషల్ మీడియాలో ప్రగతి వార్ డిసైడ్ చేస్తుందని కొందరు అంటున్నారు. ప్రగతి నెటిజన్ల కామెంట్లకు భయపడి పోస్టులు మానేస్తుందో.. ఇలాగే కంటిన్యూ చేస్తుందో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment