Pradeep Kondiparthi : వాళ్ళను నమ్మడం వల్లే.. నా వేల కోట్ల ఆస్తి పోయిందంటున్న నటుడు ప్రదీప్..

August 24, 2022 11:11 AM

Pradeep Kondiparthi : యాక్టర్ ప్రదీప్ అంటే అందరికీ పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఎఫ్2 సినిమాలో అంతేగా అంతేగా.. అంటూ హడావిడి చేసిన యాక్టర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఆ సినిమాలో ప్రదీప్ తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో నవ్వించాడు. అలాగే ఎఫ్3లో కూడా మెప్పించాడు. ప్రదీప్ ముఖ్యంగా బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

ఒకానొక సమయంలో ఆయన ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకొని చివరికి ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లోకి మారే పరిస్థితి ఏర్పడిందని తెలిపాడు. ఇంటర్వ్యూలో భాగంగా వేల కోట్ల ఆస్తులు పోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా ప్రదీప్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. తాను సంపాదించిన డబ్బు పోవడానికి కేవలం తనే కారణమని, కొందరిని గుడ్డిగా నమ్మి వ్యాపారాలు చేయడం వల్ల తన ఆస్తుల మొత్తం పోగొట్టుకున్నానని ప్రదీప్ వెల్లడించారు.

Pradeep Kondiparthi said he lost huge assets
Pradeep Kondiparthi

ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదనే గుణపాఠం నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఈయన తెలిపాడు. ఇలా డబ్బు పోగొట్టుకున్న సమయంలో చివరికి తాను ఉంటున్న ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో ఉన్నాం అని.. ఆ తర్వాత అవకాశాలు రావడంతో పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి తిరిగి తన జీవితంలో సెటిల్ అయ్యానని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉన్నానని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now