Prabhas : బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి స్టార్ అయిపోయాడు. దీంతో ఆయన తరువాత నటించిన సాహో భారీ హిట్ అయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం పలు వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్‌ను ఆది పురుష్ రూపంలో ఓ అదృష్టం వరించబోతుందని అంటున్నారు. అది ఏమిటంటే..
ఓమ్ రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ఆది పురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. వచ్చే ఆగస్టు 11వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అందువల్ల కథ ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే భారత్‌లో.. ముఖ్యంగా ఉత్తరాదిలో చాలా మందికి రాముడు అంటే సెంటిమెంట్ ఎక్కువ. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా రామాయణం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. కనుక ఈ మూవీని భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 15 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రాముడు అంటే యూనివర్సల్ కనుక అందరూ ఈ సినిమా చూస్తారు. దీనికి వరల్డ్ వైడ్‌గా ఆదరణ లభిస్తుంది. దీంతో ఆ ఆదరణను క్యాష్ చేసుకునేందుకు అధిక సంఖ్యలో భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ద్వారా ప్రభాస్ అంతర్జాతీయ స్టార్ అవుతాడని అంటున్నారు. దీంతో ప్రభాస్‌ను ఆ అదృష్టం వరించబోతుందని చెబుతున్నారు. ఈ మూవీ గనుక హిట్ అయితే ప్రభాస్ దశ మారిపోతుందని, వరల్డ్ వైడ్ స్టార్ అవుతాడని.. అప్పుడు ప్రభాస్ రేంజే వేరుగా ఉంటుందని అంటున్నారు. మరి ప్రభాస్‌కు ఆది పురుష్ చిత్రంతో లక్ కలసి వస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…