Prabhas : బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు నిరాశపరిచాయి. రాధే శ్యామ్ సినిమాకు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ రాలేదు. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా హిందీలోనూ దారుణమైన వసూళ్లు వచ్చాయి. రాధే శ్యామ్ ఏ రికార్డునూ క్రియేట్ చేయలేకపోయింది. గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకున్నా.. కమర్షియల్ కథ కాకపోవడంతో అందిరికీ కనెక్ట్ కాలేకపోయింది.
ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూడడానికి ప్రేక్షకులు ఇష్ట పడటం లేదు. కేవలం మాస్ హీరోగానే ఆయన్ని చూడటానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్టు అర్ధమయింది. చిత్రంలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించారు. అయితే సినిమా ఇంత దారుణంగా ఫ్లాప్ కావడానికి కారణం కోవిడ్ లేదంటే స్క్రిప్ట్‌లో ఏదైనా మిస్ అయి ఉండవచ్చు. జనాలు నా నుండి చాలా కోరుకుంటున్నారు. విక్రమాదిత్యగా నా నుండి మరింత ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు అని ప్రభాస్ స్పష్టం చేశారు.
బాహుబలి 2 విడుదలైనప్పటి నుండి ప్రభాస్ రెండు సినిమాలు చేశాడు. అవి సాహో, రాధే శ్యామ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కవుట్ కాలేదు. బాహుబలి, బాహుబలి 2 భారీ విజయాలు తన కొత్త ప్రాజెక్ట్‌లను ప్రభావితం చేస్తాయా.. అని అడిగినప్పుడు, ప్రభాస్ ఇలా అన్నాడు, అవును, బాహుబలిలా మంచి స్పందన రావాలని నా దర్శకులు, నిర్మాతలపై ఒత్తిడి ఉంది. బాహుబలిని క్రాస్ చేయాలని, అతి పెద్ద సినిమా చేయాలని నాకు అంత ఒత్తిడి లేదు. బాహుబలి సినిమా రావడం నా అదృష్టం. కానీ దేశంలో ఉన్న అభిమానులని ఎంటర్‌టైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బాహుబలి చేయకపోయినా కూడా వాళ్లని ఎంటర్‌టైన్ చేసే సినిమాలు చేస్తానని.. అన్నాడు ప్రభాస్.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…