Chai Business : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఎంతో మంది ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. అయితే కరోనా సమయంలోనే అతను బంగారం లాంటి సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదులుకున్నాడు. అయినప్పటికీ దిగులు చెందలేదు. నెమ్మదిగా చాయ్ బిజినెస్ ను ప్రారంభించాడు. దీంతో ఇప్పుడతను నెల నెలా లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. అతనే.. మహారాష్ట్రకు చెందిన గణేష్ దుధ్‌నలె.
గణేష్ 2019లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివాడు. ఓ కంపెనీలో జాబ్ కూడా వచ్చింది. అయితే అతనికి అది తృప్తిని ఇవ్వలేదు. దీంతో అతను ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నాడు. వెంటనే తన తండ్రి నుంచి రూ.6 లక్షలు తీసుకుని తాము ఉంటున్న వాపి అనే ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్‌లో చిన్నగా చాయ్ షాప్ ప్రారంభించాడు. మసాలాలు, పండ్ల ఫ్లేవర్‌తో కూడిన చాయ్‌ని అతను అమ్మడం మొదలు పెట్టాడు. దీంతో అతని చాయ్‌కి మంచి ఆదరణ లభించింది. ఇలా అతను చాయ్ బిజినెస్‌ను విజయవంతంగా రన్ చేస్తున్న సమయంలో ప్రదీప్ జాదవ్ అనే ఇంకో యువకుడితో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి తన సంస్థను గణేష్ మరింత అభివృద్ధి చేశాడు.
అలా గణేష్ తన చాయ్ బిజినెస్‌ను సూరత్‌కు కూడా వ్యాపింపజేశాడు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, గుజరాత్ కలిపి ప్రస్తుతం అతను 7 ఔట్‌లెట్‌లను రన్ చేస్తున్నాడు. ఒక్కో దాంట్లో రోజుకు రూ.8వేలు లాభం వస్తుంది. అంటే ఒక ఔట్‌లెట్‌తోనే అతను నెలకు రూ. 2.40 లక్షలను సంపాదిస్తున్నాడన్నమాట. మొత్తం 7 ఔట్‌లెట్‌లకు కలిపి అతనికి నెలకు రూ.17 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. దీంతో అతను ఇక వెనుదిరిగి చూడలేదు. ఇక ఇప్పుడు అతని ముందున్న లక్ష్యం ఒక్కటే. దేశవ్యాప్తంగా తన చాయ్ బిజినెస్‌ను 1000 నగరాలకు విస్తరింపజేయాలని చూస్తున్నాడు. అందుకు గాను అతను పార్ట్‌నర్స్ కోసం చూస్తున్నాడు.
ఇక గణేష్ తన చాయ్ బిజినెస్‌ను చాయ్ మేకర్స్ పేరిట ఔట్‌లెట్ రూపంలో నడిపిస్తుండగా.. ప్రతి ఔట్ లెట్‌లోనూ 20 కి పైగా వెరైటీలకు చెందిన చాయ్‌లు.. 15 వెరైటీల కాఫీలను విక్రయిస్తున్నాడు. అతను విక్రయిస్తున్న చాయ్, కాఫీలకు విశేష రీతిలో ఆదరణ లభిస్తోంది. దీంతోపాటు మిల్క్‌షేక్స్, చల్లని డ్రింక్స్, కుకీస్‌ను కూడా విక్రయిస్తూ.. వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తనలాంటి ఎంతో మంది యువతకు అతను ప్రేరణగా నిలుస్తున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…