Prabhas : ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లితో ఫైట్ చేయ‌నున్న ప్ర‌భాస్..!

October 18, 2021 5:15 PM

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాల‌న్నీకూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్నాయి. అయితే ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాల బడ్జెట్ కలిపితే రూ.1000 కోట్ల పైమాటే. దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రకటించిన ప్రాజెక్ట్ కె బడ్జెట్ రూ. 500 కోట్లు. ఇక ఇటీవ‌ల అనౌన్స్ చేసిన ప్ర‌భాస్ 25వ చిత్రం స్పిరిట్ కూడా భారీ బడ్జెట్‌తో రూపొంద‌నుంద‌ని స‌మాచారం.

Prabhas to fight in spirit movie with kareena kapoor

స్పిరిట్ చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో ఢీ అంటే ఢీ అనే లేడీ విల‌న్‌గా క‌రీనా క‌పూర్ నటిస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఆమెతో ఫైట్‌ సీన్లలో ప్రభాస్‌ నటించనున్నాడట. ఇప్పుడు ప్ర‌భాస్ హీరోగా చేస్తోన్న ‘ఆది పురుష్‌’లో సైఫ్ ఆలీఖాన్.. రావ‌ణాసురుడిగా న‌టించాడు. కాగా ప్ర‌భాస్ ‘స్పిరిట్‌’ చిత్రంలో క‌రీనా క‌పూర్ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో స్పిరిట్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్‌ పాన్‌ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్‌ పొందుతున్నాడని బీ టౌన్‌ టాక్‌. ‘స్పిరిట్‌’ సినిమాకు ప్రభాస్‌ ఏకంగా రూ.150 కోట్ల భారీ పారితోషికం అందుకోనున్నాడని టాక్‌ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment