Prabhas Lamborghini Car : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్రభాస్ తన రేంజ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఖరీదైన కార్లు, విలువైన వస్తువులు వాడుతూ వార్తలలో నిలుస్తున్నాడు. ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి కూడా చిక్కాడు ప్రభాస్. తాజాగా ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్లడం వైరల్‌గా మారింది.. ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియోని షేర్ చేసి.. మేము ప్రేమ గురించి ప్రార్థించం, కేవలం కార్ల కోసమే ప్రార్థిస్తాం అని వీడియాకి కామెంట్‌గా పెట్టాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో జరుగుతున్న సినిమా షూట్ గ్యాప్ లో మారుతి ఇలా చక్కర్లు కొడుతున్నాడని అంటున్నారు. ప్రభాస్ లంబోర్గిని కారుని మారుతి డ్రైవ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తునే , మారుతీతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు.
ప్రభాస్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటికి అదనంగా గత ఏడాది లంబోర్గిని కారు వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. ఎన్టీఆర్ కూడా కొన్ని రోజుల క్రితం ఇదే కారుని కొనుగోలు చేశాడు. అయితే ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సలార్, ప్రాజెక్ట్ కెతో పాటు రాజా డీలక్స్ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. త్వరలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన ఈ సినిమాలో నటించనున్నారు. వీరిద్దరు హీరోలుగా ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…