Prabhas Lamborghini Car : ప్ర‌భాస్ ద‌గ్గ‌ర ఉన్న కోట్ల విలువ చేసే కారును చూశారా.. ఎలా ఉందో తెలుసా..?

January 31, 2023 8:57 PM

Prabhas Lamborghini Car : బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ ఎంత‌గా మారిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న ప్ర‌భాస్ త‌న రేంజ్ విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. ఖ‌రీదైన కార్లు, విలువైన వ‌స్తువులు వాడుతూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ప్రభాస్ దగ్గర అత్యంత ఖరీదైన లంబోర్గిని కార్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్ లో హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ పలు సార్లు మీడియాకి కూడా చిక్కాడు ప్రభాస్. తాజాగా ఈ లంబోర్గిని కారులో డైరెక్టర్ మారుతి షికారుకు వెళ్ల‌డం వైర‌ల్‌గా మారింది.. ప్రభాస్ లంబోర్గిని కారుని డైరెక్టర్ మారుతి నడుపుతున్న వీడియోని మారుతి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియోని షేర్ చేసి.. మేము ప్రేమ గురించి ప్రార్థించం, కేవలం కార్ల కోసమే ప్రార్థిస్తాం అని వీడియాకి కామెంట్‌గా పెట్టాడు. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్రభాస్ తో జరుగుతున్న సినిమా షూట్ గ్యాప్ లో మారుతి ఇలా చక్కర్లు కొడుతున్నాడని అంటున్నారు. ప్రభాస్ లంబోర్గిని కారుని మారుతి డ్రైవ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా ఈ వీడియోకి కామెంట్స్ చేస్తునే , మారుతీతో ప్రభాస్ సినిమా అప్డేట్స్ అడుగుతున్నారు.

Prabhas Lamborghini Car have you seen it how is it
Prabhas Lamborghini Car

ప్రభాస్ గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటికి అదనంగా గత ఏడాది లంబోర్గిని కారు వచ్చి చేరింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లలో ఇదీ ఒకటి. ఎన్టీఆర్ కూడా కొన్ని రోజుల క్రితం ఇదే కారుని కొనుగోలు చేశాడు. అయితే ప్ర‌భాస్ సినిమాల విష‌యానికి వ‌స్తే స‌లార్, ప్రాజెక్ట్ కెతో పాటు రాజా డీల‌క్స్ సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. త్వరలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన ఈ సినిమాలో నటించనున్నారు. వీరిద్దరు హీరోలుగా ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now