Prabhas : బాహుబలి సినిమాతో ప్రభాస్ స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో బాహుబలి తరువాత ఆయన అన్నీ పాన్ ఇండియా మూవీల్లోనే నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభాస్ పలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్‌కు చెందిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వెండితెరపై ప్రభాస్, అనుష్క శెట్టిల రొమాన్స్ ఎంతలా ఉంటుందో అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. దీంతో వీరి మధ్య రిలేషన్ ఉందని, ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని.. పెద్ద ఎత్తున అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని వారు ఖండించారు. తాము ఫ్రెండ్స్ మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు.
అయితే ప్రభాస్‌ను ఇటీవల ప్రభాకర్ అనే ఓ అభిమాని ముంబై వెళ్లి మరీ కలిశాడు. తాను ఎంతో కాలం నుంచి ప్రభాస్‌ను కలవాలనుకున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరిందని అతను తెలిపాడు. అయితే ప్రభాస్‌ను కలిసిన సందర్భంగా ప్రభాకర్ తన బిడ్డకు పేరు పెట్టాలని ప్రభాస్‌ను కోరాడట. దీంతో ప్రభాస్ ఆ పాపకు అనుష్క అని పేరు పెట్టాడట. ఆ విషయం తెలిసి అనుష్క తీవ్రమైన భావోద్వేగానికి గురైందట. కన్నీటి పర్యంతమైందట.
దీన్ని బట్టి చూస్తే అనుష్క, ప్రభాస్‌ల మధ్య బలమైన బంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే వీరి మధ్య ప్రేమ ఉంది కానీ.. పెళ్లి చేసుకునేందుకు ఎవరో అడ్డు వస్తున్నారని.. ఫ్యాన్స్ అంటున్నారు. అయినప్పటికీ వీరు ఎప్పటికప్పుడు విషెస్ తెలుపుకుంటూనే మంచి ఫ్రెండ్స్‌గా అయితే కొనసాగుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్, అనుష్కల మధ్య గట్టి బంధం ఉందని మనకు అర్థమవుతోంది. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…