Kantara Movie : సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది అనుష్క. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సత్తాచాటింది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు స్వీటీ ఇమేజ్‌ను మరింత పెంచాయి. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైనే అయ్యింది. 40 ఏళ్లు వయసున్న స్వీటి మాత్రం ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. అయితే ఆమె పెళ్లిపై ఎప్పుడూ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.
ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారని, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించలేదు. ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రం కాంతారా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్‌లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ శనివారం విడుదల చేయగా.. ఈ సినిమాపై స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టి ప్రశంసలు కురిపించింది.
ఓ పక్క కాంతారా మూవీ త్రూ అవుట్ ఇండియాను షేక్ చేస్తుంటే.. మరో పక్క ఈ సినిమాను చూశామంటూ ట్వీట్ చేసిన ప్రభాస్, అనుష్కల మ్యాటర్ మరోసారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరు కలిసే ఈ సినిమా చూశారనే డౌట్‌ను అందరిలో కలిగేలా చేస్తోంది. ఇప్పుడిదే.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్, అనుష్కల మధ్య ఏదో ఉందని.. అది లవ్ అనే అనుకుంటున్న నెటిజన్స్‌కు.. కాంతారా మూవీపై వీరు చేసిన ట్వీట్.. ఇప్పుడు హింట్ గా మారింది. వీరిద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారా.. అనే అనుమానం కలుగుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…