Adipurush : ప్ర‌భాస్ ఆదిపురుష్ 1000 శాతం హిట్ ప‌క్కా.. ఎలాగో తెలుసా..?

Adipurush : కార్తికేయ 2 చిన్న సినిమాగా విడుద‌లై ఎవ‌రూ ఊహించ‌ని అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. శ్రీ కృష్ణుడి గురించిన చ‌రిత్ర‌ను తెలుపుతూ భ‌క్తి భావంతో తీసిన ఈ చిత్రానికి హిందీ భాష‌లో కూడా ఉత్త‌రాది హిందూ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో కేవ‌లం రూ.20 కోట్ల‌ నుండి రూ.30 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్ల వ‌సూళ్ల మైలురాయిని దాటేసింది.

ఇక‌ శ్రీ కృష్ణుడి గొప్పద‌నాన్ని చాటి చెప్ప‌డం వ‌ల‌ననే కార్తికేయ 2 చిత్రం ఘ‌న విజ‌యం సాధించింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే త‌ర‌హాలో భార‌త దేశంలో ఎక్కువ‌గా పూజించ‌బ‌డే శ్రీ రాముడిపై ఆయ‌న గొప్ప ద‌నాన్ని, ఘ‌న కీర్తిని చూపించే విధంగా రాబోయే ప్ర‌భాస్ సినిమా ఆదిపురుష్ కూడా ఊహ‌కంద‌ని విజ‌యం సాధిస్తుంద‌ని, థియేట‌ర్లు రామ మందిరాలుగా మారిపోతాయ‌ని సోష‌ల్ మీడియాలో టాక్ న‌డుస్తోంది. ఇక ఈ సినిమాతో ప్ర‌భాస్ క‌చ్చితంగా పెద్ద నేష‌న‌ల్ స్టార్ అయిపోతాడ‌ని ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు బాహుబ‌లి సినిమా రికార్డుల‌ను కూడా కేవ‌లం 2 వారాల్లోనే బ్రేక్ చేయ‌బోతుంద‌ని ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Adipurush

అయితే ఈ చిత్రంలో రావ‌ణుడి పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ న‌టించ‌నున్న సంగ‌తి ఇదివ‌ర‌కు తెలిసిందే. ఆయ‌న చాలా గొప్ప న‌టుడు అయిన‌ప్పటికీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈయ‌న‌తోపాటు ఇంకొంద‌రు న‌టుల‌పై వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతున్నందు వ‌ల‌న దీని ప్ర‌భావం ఆదిపురుష్ చిత్రంపై ప‌డుతుందేమోన‌ని కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. ఒక‌వేళ అలా గానీ జ‌రిగితే ఈ సినిమా కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బాయ్ కాట్ ముప్పును ఎదుర్కొన వ‌ల‌సి వ‌స్తుంద‌ని వారు అంచ‌నా వేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఫ‌లితాన్ని భ‌విష్య‌త్తు మాత్ర‌మే నిర్ణ‌యిస్తుంది. క‌నుక ఏం జ‌రుగుతుందో తెలియాలంటే.. సినిమా విడుద‌ల అయ్యే వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM