Poorna : శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది పూర్ణ. పూర్ణ అసలు పేరు షమ్మా కాసిం. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన సీమ టపాకాయ, రవిబాబు దర్శకత్వంలో అవును చిత్రాలతో సక్సెస్ ను అందుకుని ప్రేక్షకులలో మరింత గుర్తింపును సంపాదించుకుంది. 2004లో మళయాళంలో మంజు పోలోరు పెంకుట్టి చిత్రంతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది హీరోయిన్ పూర్ణ.
లడ్డూ బాబు, నువ్విలా నేనిలా వంటి ఎన్నో చిత్రాల్లో నటించి నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటనలోనే కాదు డాన్స్ లో కూడా ఆదరగొట్టేస్తోంది. ఢీ షోలో అద్భుతంగా డ్యాన్స్ చేసే కంటెస్టెంట్స్ బుగ్గలు కొరుకుతూ విమర్శలకు కూడా గురవుతుంటుంది పూర్ణ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిలో పూర్ణ కూడా ఒకరు.
తన లేటెస్ట్ ఫోటోస్ ను, డ్యాన్స్ వీడియోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో మిలియన్ కు పైగా అభిమానులు ఉన్నారు. లేటెస్ట్ గా ఒక డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది పూర్ణ. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో పూర్ణ నడుము ఉందో లేదో అన్నట్లు తిప్పుతూ డ్యాన్స్ ఇరగదీసింది. నెటిజన్లు సైతం పూర్ణ గారు మీరు గ్రేట్ డ్యాన్సర్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ సూపర్ పెర్ఫార్మెన్స్.. అంటూ పూర్ణ డ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పూర్ణ.. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో దాదాపుగా 50కి పైగా చిత్రాలలో నటించింది. ప్రస్తుతం పూర్ణ వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…