Viral Pic : చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా, ఎప్పుడైనా మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్య స్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. అలాగే మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఒకప్పుడు ఎలా ఉండేవారు.. అని మనకు అనిపిస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడూ కొంత మంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్, చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో ఉన్న చిన్నారి లిప్ స్టిక్ వేసుకుంటూ తన అందాన్ని అద్దంలో చూసుకుంటోంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు.. తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ బ్యూటీ షాలిని పాండే. ఫస్ట్ మూవీతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది షాలిని. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి ఫుల్ పాపులారిటీ దక్కింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.
అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్‌వీర్ సింగ్ సరసన జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీంతో ఇప్పుడు షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి దీంతోనైనా ఈ అమ్మడికి అవకాశాలు పెరుగుతాయా.. లేదా.. అనేది చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…