Poonam Kaur : నాగార్జున గురించి ట్వీట్ చేసిన పూన‌మ్ కౌర్‌.. స‌మంత విష‌య‌మేనా ?

October 9, 2021 12:29 PM

Poonam Kaur : ఈ మ‌ధ్య కాలంలో న‌టి పూన‌మ్ కౌర్ ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తోంది. ప‌వ‌న్‌పై పోసాని చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆమె పేరు ఎక్కువ‌గా వినిపించింది. అయితే ఆ అంశం ముగిసిపోయినా పూన‌మ్ కౌర్ తాజాగా పెడుతున్న ట్వీట్ల‌పై అభిమానుల‌లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

Poonam Kaur tweeted about nagarjuna is it with samantha or else

తాజాగా ఆమె పీకే ల‌వ్ అంటూ ట్వీట్ చేయ‌గా.. ఆమె పీకే అంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించే ట్వీట్ చేసింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ ఆమె పేరు పూన‌మ్ కౌర్ క‌దా. అందుక‌ని త‌న గురించే తాను ట్వీట్ చేసింద‌ని కొంద‌రంటున్నారు.

ఇక తాజాగా పూన‌మ్ కౌర్ నాగార్జున‌పై ట్వీట్ చేసింది. నాగార్జున స‌ర్ చాలా ద‌య, జాలి ఉన్న వ్య‌క్తి అని, హుందాగా ఉంటార‌ని, చాలా గొప్ప వ్య‌క్తి అని పూన‌మ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆయ‌న అంద‌రిపై ఎంతో ప్రేమ చూపిస్తార‌ని వ్యాఖ్యానించింది. అలాగే అక్కినేని కుటుంబానికి ఆ దేవుడు ఎంతో ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నాన‌ని.. పూన‌మ్ కౌర్ ట్వీట్ చేసింది.

అయితే స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్న నేప‌థ్యంలో విచారంలో ఉన్న అక్కినేని కుటుంబానికి ఓదార్పుగా ఆమె ఈ ట్వీట్ చేసిందా.. లేక.. మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్‌కు ఓటు వేయాల‌ని చెప్పేందుకు ఈ ట్వీట్ చేసిందా.. అన్న విష‌యం అర్థం కావ‌డం లేదు. కానీ ట్వీట్ లో మాత్రం తాను, నాగార్జున, ప్ర‌కాష్ క‌ల‌సి ఉన్న ఫోటోను మాత్రం ఆమె షేర్ చేసింది. దీంతో ఈమె చేసిన ట్వీట్ పై చ‌ర్చ న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now