Poonam Kaur : పూన‌మ్ కౌర్ ట్వీట్‌.. స‌మంత‌కు వ్య‌తిరేకంగా చైతూకు మ‌ద్ద‌తిస్తూనే ? వెంట‌నే డిలీట్‌..!

November 8, 2021 11:45 PM

Poonam Kaur : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ.. పోస్టులు పెట్టే న‌టి పూన‌మ్ కౌర్ ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటోంది. ఆమెకు సినిమాలు ఏమీ లేవు కానీ జ‌నాల నోళ్ల‌లో మాత్రం ఆమె పేరు ఎప్ప‌టికీ నానుతూనే ఉంటోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె పోస్టులు పెడుతుంటుంది. ఎక్కువ‌గా సామాజిక అంశాల నేప‌థ్యంలోనే ఆమె పోస్టులు ఉంటాయి.

Poonam Kaur tweet about divorce deleted after some time

ఇక తాజాగా పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఆమె ఆ ట్వీట్ చేసిన కొంత సేప‌టికే డిలీట్ చేసింది. అయిన‌ప్ప‌టికీ ఆ ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్‌ను అప్ప‌టికే తీసి పెట్టారు. దీంతో అది వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్‌కు అర్థం ఏమిటంటే..?

విడాకుల అనంతరం నిజంగా మగవారికి బాధ ఉండదా ? కేవలం ఆడ‌వాళ్లే బాధ‌లు ప‌డ‌తారా ? కొంద‌రు ఆడ‌వాళ్లే మ‌గ‌వారిని మాట‌ల‌తో బాధిస్తారు. వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయి. ఈ సమాజమే పక్షపాతంతో వ్యవహరిస్తుందా ? అసలు ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా ? విడాకులపై మనకు కచ్చితమైన ఆలోచ‌న‌ ఉందా ? అని ఆమె ట్వీట్ చేసింది.

అయితే ఈ ట్వీట్‌ చేసిన కొద్ది వ్యవధిలోనే పూనమ్ ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. దీంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది ? అన్న‌ది చర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల టాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న జంట స‌మంత‌, చైతూనే. ఈ క్ర‌మంలో ఆమె చైతూను స‌పోర్ట్ చేస్తూ స‌మంత‌కు వ్య‌తిరేకంగా ఆ ట్వీట్ చేసింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now