Poonam Kaur : మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచిన పూన‌మ్ కౌర్‌.. మ‌గాళ్ల‌ను భ‌య‌పెట్ట‌డానికే అలా చేస్తున్నార‌ట‌..

September 30, 2022 6:21 PM

Poonam Kaur : ఎలాంటి విషయాల్లోనైనా తన అభిప్రాయాన్ని ఏమాత్రం భయపడకుండా చెప్పే నటి పూనమ్ కౌర్. ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండే పూనమ్ కు దేవుడు అంటే ఎంతో భక్తి కూడా ఉంది. తాజాగా అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్లు చేసింది. గురువారం రోజు 14 నుంచి 20 వారాల లోపు ఉన్న ప్రెగ్నెంట్ యువతులకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని, ఒకవేళ పెళ్లి అయినా కాకపోయినా ఒక స్త్రీకి అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

అయితే ఈ తీర్పుపై పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆమె తీర్పుకు మద్దతు ఇస్తూనే కొందరు ఆడవాళ్ళ తీరును తప్పుబట్టింది. గర్భం దాల్చిన ప్రతి మహిళకు బిడ్డను కనాలా, లేదా ? అని నిర్ణయించుకునే హక్కు ఉంది. చాలా మంది ఆడవాళ్లు గర్భం దాల్చడం సామాజిక, ఆర్థిక భద్రతగా భావిస్తున్నారు. బయట ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న మగాళ్లను రిలేషన్ కి కట్టుబడి ఉండేలా చేయడానికి గర్భాన్ని వాడుతున్నారు. ఆడవాళ్లు పునరుత్పత్తి సామర్థ్యాన్ని తమ స్వార్థ ప్రయోజాలకు ఉపయోగించకూడదు, మతపరమైన సంస్థలు అబార్షన్ ని తప్పుడు చర్యలకు వాడుతున్నారని అన్నది.

Poonam Kaur sensational comments on latest supreme court judgement
Poonam Kaur

పూనమ్ కౌర్ చేసిన ఈ వాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. దీనిపై మహిళా సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇక తరచుగా పూనమ్ కౌర్ సోషల్ మీడియా పోస్ట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఆమె పరోక్షంగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్లు పోస్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరో పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైరికల్ పోస్ట్స్ వేస్తూ ఉంటుంది. పూనమ్ చర్యలు నచ్చని పవన్ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడుతూ ఉంటారు. గత కొన్నాళ్లుగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now