Poonam Kaur : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీపై పూన‌మ్ కౌర్ వివాద‌స్ప‌ద ట్వీట్‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు..

February 7, 2022 8:34 AM

Poonam Kaur : నటి పూన‌మ్ కౌర్ ఎల్లప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె చేసే ట్వీట్లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి ఎన్నో వివాదాస్ప‌ద ట్వీట్లు చేసింది. త‌రువాత వెంట‌నే డిలీట్ చేసింది. అయితే ఇప్పుడు కూడా ఆమె అలాగే చేసింది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీని కించ ప‌రిచేలా ఆమె ట్వీట్ చేసింది. అయితే ఏమ‌నుకుందో ఏమోగానీ వెంట‌నే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్ప‌టికే ఆ ట్వీట్ తాలూకు ఫొటో వైర‌ల్‌గా మారింది.

Poonam Kaur controversial tweet viral
Poonam Kaur

తాజాగా ప్ర‌ధాని మోదీ ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని తెలుగు సినిమాల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఇక్క‌డ ఎంతో క్రియేటివ్‌గా సినిమాల‌ను తీస్తార‌ని.. తెలుగు భాష కూడా ఎంతో గొప్ప‌ద‌ని మోదీ అన్నారు. అయితే ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై పూన‌మ్ కౌర్ ట్వీట్ చేసింది.

తెలుగు సినిమాని ప్రధాన మంత్రి అర్థం చేసుకున్న విధానం.. ఇక్కడ ఉన్న దుస్థితికి చాలా తేడా ఉంది.. అంటూ పూన‌మ్ కౌర్ ట్వీట్ చేసింది. అయితే ఆమె ఆ ట్వీట్‌ను వెంట‌నే డిలీట్ చేసింది. కానీ దాన్ని అప్ప‌టికే స్క్రీన్ షాట్ తీసి వైర‌ల్ చేశారు. దీంతో ఆమెపై నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఓ వైపు ప్ర‌ధాని అంత‌టి వారే తెలుగు సినిమాను మెచ్చుకుంటే పూన‌మ్ కౌర్ మాత్రం తెలుగు సినీ ఇండ‌స్ట్రీని కించ ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేసింద‌ని.. ఇది స‌రికాద‌ని అంటున్నారు. మొత్తానికి పూన‌మ్ కౌర్ మ‌ళ్లీ వివాదాస్ప‌ద ట్వీట్‌తో వార్త‌ల్లో నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now