Pooja Hegde : సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డె ఒకరు. ఈమె వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎంతో బిజీగా మారింది. అయితే ప్రస్తుత ఈమె చేస్తున్న సినిమాల షూటింగ్‌లు అన్నీ ముగిశాయి. దీంతో చాలా రోజుల తరువాత పూజా హెగ్డె ఎలాంటి షూటింగ్ లేకుండా ఖాళీగానే ఉంటోంది.
పూజా హెగ్డె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా కారణంగా ఈ చిత్రాల విడుదల ఆలస్యం అవుతోంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె కొత్త మూవీ దేనికి కూడా సంతకం చేయలేదు. దీంతో చాలా రోజుల తరువాత పూజాకు ఖాళీ సమయం లభించింది.
ఈ క్రమంలోనే పూజా ఇటీవలే మాల్దీవ్స్‌కు వరుస టూర్స్ వేసింది. ఇక వెకేషన్ నుంచి వచ్చిన ఈ భామ ముంబైకి వెళ్లిపోయింది. అక్కడ ఈమె రీసెంట్‌గా కొత్త ఇంటిని కట్టుకుంది. ప్రస్తుతం అందులోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం చాలా ఖాళీ సమయం లభించినందున ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. వీలైనన్ని కొత్త సినిమాలకు సంతకాలు చేయాలని పూజా హెగ్డె భావిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ఈమె కొత్త మూవీల గురించిన వివరాలు తెలియనున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…