Pooja Hegde : చాలా రోజుల త‌రువాత ఖాళీగా ఉన్న పూజా హెగ్డె..!

January 26, 2022 8:12 PM

Pooja Hegde : సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ల‌లో పూజా హెగ్డె ఒక‌రు. ఈమె వ‌రుస సినిమా ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటూ ఎంతో బిజీగా మారింది. అయితే ప్ర‌స్తుత ఈమె చేస్తున్న సినిమాల షూటింగ్‌లు అన్నీ ముగిశాయి. దీంతో చాలా రోజుల త‌రువాత పూజా హెగ్డె ఎలాంటి షూటింగ్ లేకుండా ఖాళీగానే ఉంటోంది.

Pooja Hegde is now completely free after so many days

పూజా హెగ్డె న‌టించిన రాధే శ్యామ్‌, ఆచార్య‌, బీస్ట్ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. కానీ క‌రోనా కార‌ణంగా ఈ చిత్రాల విడుద‌ల ఆల‌స్యం అవుతోంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె కొత్త మూవీ దేనికి కూడా సంత‌కం చేయ‌లేదు. దీంతో చాలా రోజుల త‌రువాత పూజాకు ఖాళీ స‌మ‌యం ల‌భించింది.

ఈ క్ర‌మంలోనే పూజా ఇటీవ‌లే మాల్దీవ్స్‌కు వ‌రుస టూర్స్ వేసింది. ఇక వెకేష‌న్ నుంచి వ‌చ్చిన ఈ భామ ముంబైకి వెళ్లిపోయింది. అక్క‌డ ఈమె రీసెంట్‌గా కొత్త ఇంటిని క‌ట్టుకుంది. ప్ర‌స్తుతం అందులోనే ఉంటోంది. అయితే ప్ర‌స్తుతం చాలా ఖాళీ స‌మ‌యం ల‌భించినందున ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని.. వీలైన‌న్ని కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేయాల‌ని పూజా హెగ్డె భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఈమె కొత్త మూవీల గురించిన వివ‌రాలు తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now