Pelli Sandadi 2021 : ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న పెళ్లిసంద‌D సినిమా.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

June 22, 2022 4:13 PM

Pelli Sandadi 2021 : సీనియ‌ర్ న‌టుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్‌, యంగ్ హీరోయిన్ శ్రీ‌లీల క‌ల‌సి న‌టించిన పెళ్లిసంద‌D మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ వ‌హించిన మూవీ కావ‌డంతో ఈ మూవీని చాలా మంది చూశారు. అయితే ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఎక్కువ రోజుల పాటు ఆడ‌లేదు. క‌రోనా త‌రువాత ఈ మూవీ రిలీజ్ కావ‌డంతో అప్ప‌ట్లో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు మూవీల‌ను చూసేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఇంకా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ పెద్ద‌గా హిట్ కాలేక‌పోయింది. కానీ ఇందులో న‌టించిన రోష‌న్‌, శ్రీ‌లీల ల‌కు మాత్రం న‌ట‌న‌లో మంచి మార్కులే ప‌డ్డాయి.

ఇక ఈ మూవీలో న‌టించిన శ్రీ‌లీల‌కు ఈ మూవీ అనంత‌రం వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఈమె ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది. అయితే ఈ మూవీ అక్టోబ‌ర్ 15, 2021వ తేదీన రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ఓటీటీలో మాత్రం ఇప్ప‌టికీ రాలేదు. ఎన్నో సినిమాలు నెల రోజుల్లోప‌లే ఓటీటీలో సంద‌డి చేస్తున్నాయి. కానీ ఈ సినిమాను మాత్రం ఓటీటీలో ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేయ‌లేదు. కానీ ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు.

Pelli Sandadi 2021 movie finally releasing on OTT
Pelli Sandadi 2021

జీ5 యాప్‌లో ఈ మూవీ ఈ నెల 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మేర‌కు జీ5 వారు ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది. అయితే థియేట‌ర్ల‌లో మంచి టాక్ వ‌చ్చినా సినిమాను చూసేందుకు మాత్రం ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూప‌లేదు. మ‌రిప్పుడు ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి టాక్‌ను తెచ్చుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now