Aadi Saikumar : బీచ్ ఒడ్డున పాయ‌ల్‌తో రొమాన్స్ చేస్తున్న ఆది..!

October 29, 2021 6:30 PM

Aadi Saikumar : ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పూత్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. కల్యాణ్‌ జి గోగణ తెరకెక్కిస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. చాలా కాలంగా ఒక్క హిట్టు కోసం చూస్తున్న ఆది ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. క‌ళ్యాణ్ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో తీస్ మార్ ఖాన్ అనే సినిమా చేస్తున్న ఆది ఇప్పుడు పాయల్ రాజ్ పూత్ తో బీచ్ లో రొమాన్స్ లో మునిగితేలుతున్నాడు.

Aadi Saikumar at beach with payal rajput

చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌గా, ఈ పోస్టర్‌లో ఆది, పాయల్‌ సముద్ర తీరంలో కూర్చొని.. ఒకరినొకరు చూసుకుంటూ రొమాంటిక్‌గా కనిపించారు. ‘‘యాక్షన్‌ ప్రాధాన్యమున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. నాయకానాయికలపై ఓ రొమాంటిక్‌ గీతం తెరకెక్కిస్తున్న నేప‌థ్యంలో పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో పాయల్‌, ఆది చాలా కొత్తగా కనిపిస్తారు’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు ఆది సాయి కుమార్. ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి తీస్ మార్ ఖాన్. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మ‌రోవైపు పాయ‌ల్ కూడా మంచి హిట్ కోసం ఆశ‌గా ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now