Payal Rajput : ఆది, పాయ‌ల్ రాజ్‌పూత్‌.. వామ్మో.. ఇది మామూలు డోస్ కాదు.. వీడియో..!

July 25, 2022 5:50 PM

Payal Rajput : ఆది సాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పూత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం.. తీస్‌మార్‌ఖాన్‌. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుదలైన ఒక పాట‌, టీజ‌ర్, పోస్టర్స్ ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. టీజ‌ర్‌లో అయితే ఒక పాట‌లో ఆది, పాయ‌ల్ భీభ‌త్స‌మైన రీతిలో రొమాన్స్ పండించారు. అయితే అదే పాట‌ను ఇప్పుడు విడుదల చేశారు. స‌మ‌యానికే అంటూ సాగే ఈ పాట పూర్తి రొమాంటిక్‌గా ఉండ‌డం విశేషం. ఇందులో ఆది, పాయల్ మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పాట నిండా ఘాటైన రొమాంటిక్ సీన్ల‌ను జోడించారు. ఈ క్ర‌మంలోనే ఈ పాట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

ఆది సాయి కుమార్, పాయ‌ల్ రాజ్‌పూత్‌లు స‌మ‌యానికే పాట‌లో అద్భుత‌మైన రొమాన్స్‌ను పండించారు. వీరు ఈ పాట‌లో పిచ్చెక్కించేలా నటించారు. దీంతో వీరి రొమాన్స్ చూసి యువ‌త ఫిదా అవుతున్నారు. పాయ‌ల్ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు కుర్ర‌కారు మైమ‌రిచిపోతున్నారు. ఈమె స‌హ‌జంగానే అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. ఇక రొమాంటిక్ సాంగ్ అనే స‌రికి కాస్త ఎక్కువ‌గానే డోస్ పెంచింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇందులో ఆది సాయి కుమార్ కూడా ష‌ర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించాడు. ఈ క్ర‌మంలోనే ఈ పాట యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

Payal Rajput and Aadi in tees maar khan movie latest song
Payal Rajput

ఇక ఈ పాట‌కు సాయి కార్తీక్ ట్యూన్స్ అందించాడు. అలాగే రాకేందు మౌళి సాహిత్యాన్ని స‌మ‌కూర్చాడు. శృతి ఈ పాట‌ను పాడింది. ఇక ఈ పాట ద్వారా చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆగ‌స్టు 19వ తేదీన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రొడ‌క్ష‌న్ నం.3గా విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డాక్ట‌ర్ నాగం తిరుప‌తి రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి క‌ల్యాణ్ గోగ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే వ‌రుస ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ఆదికి ఈ మూవీ అయినా హిట్‌ను అందిస్తుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now